Home Andhra Pradesh చంద్రబాబు విదేశీ పర్యటన 18 నుంచి

చంద్రబాబు విదేశీ పర్యటన 18 నుంచి

chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. తొలుత రాజధాని అమరావతి డిజైన్ల ఖరారుకు ఇంగ్లాండ్ వెళతారని భావించారు. కానీ ఇప్పుడు సీఎం మూడు దేశాల్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు వివరించారు. ఈ నెల 18 నుంచి 26 వరకు ముఖ్యమంత్రి మూడు దేశాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, రాజధాని పరిపాలన నగరం ఆకృతుల ఖరారు చేయడమే లక్ష్యంగా అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇంగ్లాండ్‌ల్లో  సీఎం చంద్రబాబు పర్యటిస్తారని వెల్లడించారు.

                        ఈనెల 18వ తేదీ నుంచి 20 వరకు 3 రోజులు అమెరికాలో, 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో, చివరిగా 24 నుంచి 26వ తేదీ వరకు 3 రోజులు యూకేలో పర్యటిస్తారన్నారు. ఈ పర్యటనలో భాంగా చంద్రబాబు నాయుడుకు యూకేలో గోల్డెన్ పీకాక్ అవార్డు బహుకరించనున్నట్లు పరకాల ప్రభాకర్‌ తెలిపారు. ఈ దఫా పర్యటనలో అమరావతి లో నిర్మించే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలకు సంబంధించిన డిజైన్లు ఖరారు అవుతాయని చెబుతున్నారు. సీఎం కంటే ముందే సీఆర్ డీఏ బృందం లండన్ వెళుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here