Home Andhra Pradesh చంద్రబాబు అన్నం మానేశారా!

చంద్రబాబు అన్నం మానేశారా!

chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిండి మానేశారా?. అవునంటున్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఆయన ఇప్పుడు కేవలం ఇసుక, రాళ్లు, మట్టి మాత్రమే తింటున్నారని ఎద్దేవా చేశారు. అంతే కాదు..చంద్రబాబునాయుడు తన పేరు కూడా మార్చుకున్నారట. అది అబద్దాల నాయుడిగా. తెలుగుదేశం పార్టీ మూడేళ్ల పాలనపై రఘవీరారెడ్డి తీవ్ర ఆరోపణలతో శుక్రవారం నాడు ‘ఛార్జ్ షీట్‘ విడుదల చేశారు. దీనికి ‘దోపిడీ బాబు’ అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ అవినీతి, దోపిడి, అరాచకాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారింద’ని ధ్వజమెత్తారు. పెదబాబు, చినబాబు, టీడీపీ నేతలు కలిసి ఒక్క ఇసుకలో రూ. 29 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.      ‘సాగు నీటి ప్రాజెక్టు అంచనాలను 34 వేల కోట్ల నుంచి 74 వేల కోట్లకు పెంచేశారు. భూములు కోసం టీడీపీ మంత్రులు వీధి పోరాటాలకు దిగుతున్నారు.

                          ఎమ్మెల్సీలు జైలుకు పోతున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య రాజీ కోసమే చంద్రబాబు త్రిసభ్య కమిటీ వేశారు. లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగితే దానిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. తన అవినీతి వల్లే ప్రత్యేక హోదాపై రాజీపడ్డారు.
ఏపీలో చినబాబుకు ఒక్కడికే జాబ్ వచ్చింది. బ్యాంకులకు టీడీపీ నాయకులు వేల కోట్లు ఎగ్గొట్టారు. టీడీపీ ఆర్థిక నేరస్థులను పెంచిపోషిస్తోంది. టీడీపీ నేతలు అధికారలోకి వచ్చిన తరువాత రూ. 3 లక్షల కోట్లు దోచుకున్నారు. బాబు మీడియా గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here