Home Andhra Pradesh ట్రంప్ పెళ్లిళ్ళపై మాట్లాడే బాబు..‘జై షా’ గోల్ మాల్ పై మౌనం

ట్రంప్ పెళ్లిళ్ళపై మాట్లాడే బాబు..‘జై షా’ గోల్ మాల్ పై మౌనం

amit sha, chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ అంశంపై అయినా అనర్గళంగా మాట్లాడగలరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్యల గురించి ప్రస్తావించగలరు. భారతీయ విలువల గురించి బోధించగలరు. కానీ కొన్ని అంశాలను మాత్రం ఆయన చాలా కన్వీనెంట్ గా మర్చిపోనూ గలరు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనయుడు జై షా కంపెనీల టర్నోవర్ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వేల రెట్లు పెరగటం..ఆయన కంపెనీకి రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని దేశమంతా ఇఫ్పుడు గగ్గోలు పెడుతోంది. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బిజెపి సారధ్యంలోని ఏన్డీయే ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఉంది. యశ్వంత్ సిన్హా లాంటి బిజెపి సొంత నేతలే ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో తాను ఎవరికీ భయపడనని..తన అంత సీనియర్ నేత ఎవరూ లేరనే చెప్పే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో నోరుమెదపటంలేదు.

                                  ఆ వ్యవహారం బిజెపి చూసుకుంటుందని అన్న చందంగా మీడియాకు లీకులు ఇచ్చి వదిలేశారు. గతంలో కూడా ఓ సారి ఇదే జరిగింది. గోద్రా అల్లర్ల సమయంలో వాజ్ పేజ్ ప్రధానిగా ఉండగా..తక్షణమే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. అప్పట్లో  ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరిన మోడీ..అమిత్ షాలను చంద్రబాబు  ఏ మాత్రం పట్టించుకోలేదు. పాత విషయాలను మనసులో పెట్టుకునే తనను ఇప్పుడు ఇరకాటంలో పెడుతున్నారనే విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే  మీడియాలో అంత పెద్ద ఎత్తున అమిత్ షా తనయుడి వ్యవహారం వస్తున్నా కూడా ‘సీనియర్ మోస్ట్’ పొలిటిషన్ అయిన చంద్రబాబు మాత్రం దీనిపై ‘మౌనం’ వీడటం లేదు. వీడితే ఎలా ఉంటందో ఆయనకు తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. విచిత్రం ఏమిటంటే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిదీ అదే పరిస్థితి. ఎందుకంటే ఆయనపైనే చాలా కేసులు ఉండటంతో జగన్ కూడా ఈ ఊసెత్తకుండా చంద్రబాబును టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతున్నారు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here