Telugu Gateway
Cinema

పూజా హెగ్డె న్యూలుక్

పూజా హెగ్డె న్యూలుక్
X

టాలీవుడ్ లో ప్రస్తుతం లక్కీ హీరోయిన్ పూజా హెగ్డె. ఈ భామ నటించిన సినిమాలు అన్నీ వరస పెట్టి హిట్లు అవుతున్నాయి. అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి ఈ భామకు. తెలుగులో పూజా హెగ్డె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ తో కలసి పూజా హెగ్డె 'రాధే శ్యామ్' సినిమాలో నటిస్తోంది. మంగళవారం నాడు పూజా హెగ్డె పుట్టిన రోజు. ఈ సందర్బంగా రాదే శ్యామ్ చిత్ర యూనిట్ ఈ సినిమాలో ఆమె కొత్త లుక్ ను విడుదల చేసింది.

యూరప్ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే కనిపిస్తుంది. వెస్ట్రన్‌ ట్రెడిషనల్‌ వేర్‌ ధరించిన పూజ తలకు స్కార్ఫ్‌ కూడా కట్టుకుని కన్పిస్తోంది. ఒక విదేశీ రెస్టారెంట్‌లో ప్రభాస్‌ ఎదురుగా కూర్చున్న పూజా నవ్వులు చిందిస్తూ అందంగా కనిపిస్తోంది. ఇక ప్రభాస్‌ 41 వ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 23న 'రాధే శ్యామ్‌' టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it