Home Telangana ‘దివికేగిన’ సినారే

‘దివికేగిన’ సినారే

c narayana reddy

తెలుగు భాషకు ఇది తీరని లోటు. ప్రముఖ తెలుగు కవి, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి కన్నుమూశారు. నారాయణరెడ్డి అనే కంటే ఆయన సినారేగానే అందరికీ సుపరిచితం. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.  కరీంనగర్‌ జిల్లా హనుమాజీపేటలో జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.. సినారెగా సాహితీలోకంలో తనదైన ముద్రలు వదిలివెళ్లారు. సినారే తొలి రచన 1953లో ‘నవమి పువ్వు’. 1988 లో విశ్వంభర కావ్యానికి గాను సినారేకు ప్రతిష్టాత్మకమైన జ్ణానపీఠ్ అవార్డు అందుకున్నారు.

                          1977లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అదే సమయంలో ఆయన రాజ్యసభ సభ్యుడుగానూ సేవలు అందించారు. సినారే రాసిన  పాటలు ఎన్నో సినిమా రంగంలో విశేష ఆదరణ పొందాయి. సినారే సికింద్రాబాద్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అధ్యాపకుడిగా చేరి…తర్వాత నిజాం కాలేజీలోనూ పనిచేశారు. విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ణానపీఠ్ అవార్డు పొందిన తెలుగు కవి ఆయనే. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన వేల సంఖ్యలో పాటలు అందించారు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here