Home Andhra Pradesh చంద్రబాబుకు బుచ్చయ్యచౌదరి సవాల్

చంద్రబాబుకు బుచ్చయ్యచౌదరి సవాల్

Buchaiah Chowdary

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తాను  ఏ మాత్రం తప్పు చేయలేదని…ఏ చర్య తీసుకుంటారో తీసుకోండని సవాల్ విసిరారు. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వటం ఏ మాత్రం సరికాదని..ఈ తీరుతో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారని వ్యాఖ్యానించారు. అసంతృప్తితో ఉన్న బుచ్చయ్య చౌదరిని హోం మంత్రి చినరాజప్ప కలిశారు. తనను ఆయన దగ్గరకు ఎవరూ పంపలేదని..జిల్లా మంత్రిగా తానే బుచ్చయ్య చౌదరితో సమావేశం అయినట్లు చినరాజప్ప తెలిపారు.    ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడాన్నిబుచ్చయ్య చౌదరి వ్యతిరేకించారని…. ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చినరాజప్ప తెలిపారు.

                            తర్వాత బుచ్చయ్య చౌదరి కూడా మీడియాతో  మాట్లాడారు. రాజకీయం వ్యాపారంగా మారిందని మండిపడ్డారు.. పార్టీలో కార్యకర్తలు నలిగిపోతున్నారని… వారికి మేలు జరగాలనే బహిరంగంగా మాట్లాడుతున్నానని చెప్పారు. తను ఇప్పటికీ ఎలాంటి తప్పు చేయలేదని.. ఏ చర్యలు తీసుకుంటారో తీసుకోండని హోంమంత్రిని ఉద్దేశించి గట్టిగానే వ్యాఖ్యానించారు. దీంతో ఆయన ఏ మాత్రం వెనక్కి తగ్గే ఉద్దేశం ఉన్నట్లు కన్పించటం లేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలోనూ బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here