Home Latest News బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య

suicide

‘ఈ జీవితం వ్యర్థం. బతుకు దుర్భరం. నేనే హాయిగా ఉండటాన్ని కూడా చుట్టుపక్కల వారు చూడలేకపోతున్నారు.’ అంటూ వాట్సప్ లో పోస్టు పెట్టిన  బీటెక్ చదువుతున్న విద్యార్ధిని మౌనిక ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారం పెద్ద కలకలం రేపుతోంది.  నగరంలోని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కుటుంబ కలహాల కారణంగానే మౌనిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. సురారం కాలనీలో నివసిస్తున్న చంద్రం, రేణుక దంపతుల కుమార్తె మౌనిక.  స్థానిక నరసింహారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజిలో బీ.టెక్‌ ఫైనలియర్‌ చదువుతోంది.

                         బుధవారం మౌనికకు తన తమ్ముడితో వాగ్వాదం చోటు చేసుకున్నట్లు మౌనిక తల్లి రేణుక చెబుతున్నారు. తమ్ముడితో గొడవ అనంతరం మౌనిక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. వాస్తవానికి చంద్రం, రేణుకలది పశ్చిమ గోదావరి జిల్లా. ఇరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చిన వీరు సురారం కాలనీలో నివాసముంటున్నారు. మౌనిక ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here