Home Andhra Pradesh నంద్యాలలో టీడీపీకే బిజెపి మద్దతు

నంద్యాలలో టీడీపీకే బిజెపి మద్దతు

bjp-tdp

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం. గత కొంత కాలంగా టీడీపీ..బిజెపిల మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నంద్యాల ఉప ఎన్నిక..కాకినాడ మునిసిపల్ ఎన్నికల తరుణంలో మరింత క్లారిటీ వచ్చేసింది. రాబోయే రోజుల్లోనూ బిజెపి, టీడీపీ ఏపీలో కలసి సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు అవే సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి సంబంధించిన శనివారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే మద్దతు తెలపాలని ఏపీ బీజేపీ నిర్ణయించింది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధికారికంగా ప్రకటించింది. నంద్యాల ఉప ఎన్నికతోపాటు త్వరలో జరుగనున్న కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీతో కలిసే పనిచేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు.

                                     టీడీపీ- బీజేపీలు అటు కేంద్రంలోనూ..ఇటు రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ మద్దతు విషయంలో మాత్రం బీజేపీ తన నిర్ణయాన్ని తాజాగా ప్రకటించింది. వచ్చే వారం నుంచి నంద్యాలలో బీజేపీ శ్రేణులు కూడా టీడీపీతో కలిసి ప్రచారంలో పాల్గొంటారని కాషాయపార్టీ నేతలు తెలిపారు. నంద్యాలలో ఆగస్టు 23న పోలింగ్‌ జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. ఆగస్టు చివరి వారంలో మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి బిజెపి మద్దతు ఇవ్వటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే అక్కడ మైనారిటీలో ఏభై వేలకుపైగా ఉన్నాయి. బిజెపి తాజా నిర్ణయం టీడీపీకి మేలు చేస్తుందో..నష్టం చేస్తుందో వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here