Home Telugu బిజెపికి మరో షాక్

బిజెపికి మరో షాక్

yashwant sinha

కేంద్రంలో ఇటీవల వరకూ తిరుగులేని శక్తిగా ఉన్న బిజెపికి బ్యాడ్ టైమ్ మొదలైందా?. వరస పెట్టి జరుగుతున్న సంఘటనలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా..లోలోపల మాత్రం ఏదో జరుగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎవరూ మాట్లాడనంత వరకూ  ఓకే. కానీ ఒక సారి ఎవరైనా ధైర్యం చేసి నోరు విప్పితే చాలు ఇక అందరూ క్యూకడతారు. అది బిజెపిలో అయినా..మరో పార్టీలో అయినా. బిజెపిలో తొలుత ఆ పనిచేసింది కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా. నోట్ల రద్దు..జీఎస్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి. తర్వాత చాలా మంది అదే బాట పట్టారు. యశ్వంత్ సిన్హా మరోసారి బిజెపిపై బాంబు వేశారు. దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న  అమిత్ షా తనయుడు జై షా  కంపెనీలో టర్నోవర్ ఆకస్మాత్తుగా పెరిగిన వైనం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఖచ్చితంగా తప్పు జరిగినట్లు కన్పిస్తోందని యశ్వంత్ సిన్హా బాంబు పేల్చారు. బిజెపిలో సీనియర్ నేతలుగా ఉన్న రాజ్ నాధ్ సింగ్ మొదలుకుని పలువురు నేతలు అమిత్ షాకు అండగా నిలవగా..యశ్వంత్ సిన్హా మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ఈ వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందో వేచిచూడాల్సిందే. ‘అమిత్‌ షా కుమారుడు తన కుమారుడు  జై షా పై అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీకి ఉన్న నైతిక స్థాయిని కోల్పోయినట్లయింది.

                                  పలు పొరపాట్ల కారణంగా బీజేపీ ఇప్పుడు గిల్టీగా ఉన్నట్లు కనిపిస్తోంది. వ్యాపారవేత్త అయిన జై షా కోసం ప్రభుత్వ ఉన్నత న్యాయవాది అయిన తుషార్‌ మెహతాను కోర్టులో దించడం సరికాదు’ అని యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జై ఆస్తులు 16వేల రెట్లు పెరిగాయంటూ ది వైర్‌ అనే ఓ వెబ్‌ సైట్ ఓ  కథనం వెలువరించింది.  దీనిపై జై షా  రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును వాధించడానికి ప్రభుత్వ న్యాయవాది అయిన తుషార్‌ మెహతాను రంగంలోకి బీజేపీ దించింది. దీనిని యశ్వంత్‌ సిన్హా తప్పుబట్టారు. ‘విద్యుత్‌శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ అమిత్‌ షా కుమారుడికి రుణాన్ని మంజూరు చేసిన విధానం, ఆ తర్వాత ఆయననే వెనుకేసుకొస్తున్న తీరు చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో దర్యాప్తునకు ఆదేశించాలి. ఇందులో చాలా శాఖలు జోక్యం చేసుకున్నట్లు అనిపిస్తోంది’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here