Home Telangana బిత్తిరి సత్తి..సావిత్రికి బిజెపి బంపర్ ఆఫర్!

బిత్తిరి సత్తి..సావిత్రికి బిజెపి బంపర్ ఆఫర్!

Bittiri satti, savitri

తెలంగాణలో బిత్తిరి సత్తి..సావిత్రిల గురించి తెలియనివారుండరు. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ వార్తలతో వీరిద్దరూ పాపులర్ వ్యక్తులుగా మారిపోయారు. ఇక సత్తి అయితే ఏకంగా సినిమాల్లో కూడా ఛాన్స్ లు కొట్టేస్తున్నాడు. వీ6 ఛానల్ లో అత్యధిక రేటింగ్ ఉండే కార్యక్రమం కూడా వీరిద్దరిదే అన్న సంగతి తెలిసిందే. అందుకే తెలంగాణలో భారీ ఎత్తున పాగా వేయాలని చూస్తున్న బిజెపి కన్ను వీరిపై పడింది. బిత్తిరి సత్తితోపాటు సావిత్రి ని బిజెపి వచ్చే ఎన్నికల్లో పోటీకి దింపాలని చూస్తోంది. టిక్కెట్లు ఇవ్వటంతో పాటు ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తామని బిజెపి వీరిద్దరికి ఆఫర్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సావిత్రికి ఎంపీ సీటు…సత్తికి ఎమ్మెల్యే సీటు బిజెపి ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే కెరీర్ పరంగా ఎంతో పీక్ లో ఉన్న తాము రాజకీయాల్లోకి రావాలా? వద్దా అనే విషయంలో ప్రస్తుతం సంశయంలో ఉన్నట్లు సమాచారం.

                                టిక్కెట్లు ఇవ్వటం పాటు ఎన్నికల ఖర్చు విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బిజెపి  వీరికి భరోసా ఇచ్చింది. అయితే వీరిద్దరూ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దక్షిణాదిలో పాగా వేయటానికి భారీ ఎత్తున కసరత్తు చేస్తున్న బిజెపి ఇప్పటికే పాపులర్ వ్యక్తులతో పాటు వివిధ రంగాల్లో మంచి గుర్తింపు ఉన్న వారిని అన్వేషించే పనిలో పడింది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ..స్థానిక నాయకత్వానికి పలు అంశాలపై దిశా, నిర్దేశం చేశారు. అందులోభాగంగానే ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక పనిలో పడినట్లు కన్పిస్తోంది. బిత్తిరి సత్తి..సావిత్రిలను రాజకీయాల్లోకి తేవాలనే బిజెపి ప్రయత్నాలు నెరవేరుతాయో లేదో వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here