Home Telugu భారత్‌లోనే ఐదు శాతం బిలియనీర్లు

భారత్‌లోనే ఐదు శాతం బిలియనీర్లు

Billionaires

భారత దేశంలో పేదవాడు రోజుకు రూ.100 సంపాదించడమే గగనమవుతోంటే, అత్యధిక ఆదాయం కలిగిన ధనవంతులు మరింత పోగు చేసుకుంటు, ప్రపంచ ధనవంతులతో పోటీ పడుతున్నారు. దీంతో దేశంలో రానురాను ఆర్థిక అసమానతలు భారీగా పెరుగుతున్నాయని అంతర్జాతీయ సంపద అధ్యయన సంస్థ ‘నైట్‌ ఫ్రాంక్‌’ తాజా నివేదికలో వెల్లడయ్యింది. ప్రపంచ వ్యాప్తంగ ఉన్న మొత్తం మిలియనీర్లలో 2 శాతం మంది భారత దేశంలోనే ఉన్నారని నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది. ప్రపంచంలోని మొత్తం బిలియనేర్‌ కుబేరుల్లో 5 శాతం ఇండియాలో ఉన్నట్టు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 89 దేశాల్లోని 125 పట్టణాల్లోని ధనికుల ఎదుగుదలను అధ్యయనం చేస్తూ ‘నైట్‌ ఫ్రాంక్‌’ సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 900 ప్రముఖ ప్రయివేటు బ్యాంకులు, వెల్త్‌ అడ్వయిజరీ సంస్థల నుంచి సమగ్ర సమాచారాన్ని పోగు చేసి నైట్‌ ఫ్రాంక్‌ ఈ నివేదికను రూపొందించింది. 

             నైట్‌ ఫ్రాంక్‌ సమాచారం మేరకు దేశంలో మిలియన్‌ డాలర్లు (రూ.6.6 కోట్ల) అంత కంటే ఎక్కువ సంపద, నికర ఆస్తులను కలిగిన వారు 2,64,300 మంది ఉన్నారు. 2016 సంవత్సరానికి గాను ‘అల్ట్రా హై నెట్‌ వర్త్‌ ఇండివీడ్యుయల్స్‌’ (యుహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ)ల సంపద వృద్ధి విషయంలో భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. ఇదే జోరు కొనసాగితే రానున్న దశాబ్ద కాలంలో భారత్‌ జాబితాలో మూడో స్థానాన్ని అందుకొనే అవకాశం లేకపోలేదని ‘నైట్‌ ఫ్రాంక్‌’ తెలిపింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here