Home Cinema బాహుబలి హవా…సాగుతూనే ఉంది

బాహుబలి హవా…సాగుతూనే ఉంది

Bahubali2

బాహుబలి2 సినిమా విడుదలై..రికార్డుల మీద రికార్డులు నెలకొల్పినా..ఈ సినిమా నిత్యం ఏదో ఒక వార్తల రూపంలో నడుస్తూనే ఉంది. అలా ఉంది మరి బాహుబలి 2 హవా. భారత దేశ చరిత్రలో అత్యంత భారీ మొత్తం వసూళ్ళు సాధించిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. కాకపోతే చైనాలో విడుదలైన తర్వాత దంగల్ ఈ సినిమా రికార్డును అధిగమించింది. బాహుబలి 2 కూడా చైనాలో విడుదలైన తర్వాత మళ్ళీ ఈ రికార్డులు ఎటుమారతాయో వేచిచూడాల్సిందే. అయితే ప్రస్తుతం అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈ సినిమాను మరో ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించే ఛాన్స్ దక్కించుకుంది.

                           ఈ నెల 22న ప్రారంభం కానున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బాహుబలి 2ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించనున్నారు. ఇటీవల జరిగి కేన్స్ ఫిలిం ఫెస్టివల్‑తో పాటు రొమేనియా ఫిలిం ఫెస్టివల్ లోనూ బాహుబలి 2కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్కోలోనే అదే స్పందన వస్తుందని అంచనా. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ హైయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించిన బాహుబలి 2 ఇప్పటి వరకు 1650 కోట్లకు పైగా వసూలు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here