Home Cinema బాహుబలి 2@1500 కోట్లు

బాహుబలి 2@1500 కోట్లు

bahubali-2

భారతీయ చలనచిత్ర చరిత్రలో బాహుబలి 2 కొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమా సాధించని ఘనత ఈ సినిమాకు దక్కింది. వెయ్యి కోట్ల రికార్డును ఎప్పుడో చెరిపేసిన బాహుబలి 2..ఇప్పుడు 1500 కోట్లరూపాయల వసూళ్ళకు కూతవేటు దూరంలోనే ఉంది. మరో రెండు రోజుల్లో ఇది కూడా పూర్తవుందని సినీ పండితులు తేల్చారు. ప్రస్తుతం 1450 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా వారాంతానికి 1500 కోట్ల మార్క్ ను కూడా దాటేయనుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా బాహుబలి 2 రికార్డ్ నెలకొల్పనుంది.

                           మొదటి రెండు వారాల్లో భారత్ లోనే 1012 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓవర్ సీస్ తో కలిపి 1250 కోట్ల వసూళ్ళు నమోదు చేసింది. తాజా లెక్కల ప్రకారం 19 రోజుల్లో బాహుబలి 2  భారత్ లో 1189 కోట్లు, ఓవర్ సీస్ లో 261 కోట్ల వసూళ్లు సాధించి 1450 కోట్ల మార్క్ కు చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. మరో రెండు రోజుల్లో 1500 కోట్ల మార్క్ అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. బాహుబలి 2 నెలకొల్పిన ఈ రికార్డును బద్దలు కొట్టడానికి భారతీయ సినిమాకు ఎంత కాలం పడుతుందో వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here