Home Cinema వార్నీ…బీకాంలో ఫిజిక్స్ ను ఇలా కూడా వాడేశారా?

వార్నీ…బీకాంలో ఫిజిక్స్ ను ఇలా కూడా వాడేశారా?

andhagadu

కొత్తదనం ఏది కనపడినా వాళ్ళు వదలరబ్బా?. ఈ మధ్య ఎవరి మనసులో ఏముందో తెలిసేది కాదు. ఈ మధ్య సోషల్ మీడియా వ్యాప్తి తర్వాత అందరూ రిపోర్టర్లే..అందరూ కవులే. ఎవరికి ఎవరూ తక్కువ కాదు అక్కడ అన్న చందంగా రెచ్చిపోతున్నారు. వాళ్లను చూసిన తర్వాత కవులు..రిపోర్టర్లు ఎందుకు పనికొస్తారనుకున్న సందర్భాలు కూడా కోకొల్లలు. కానీ వాళ్ల ఉద్యోగం వేరు కాబట్టి..అలా సోషల్ మీడియాలో పెట్టి సరిపుచ్చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకంటే బీకామ్ లో ఫిజిక్స్ కోసం వచ్చిన తిప్పలు ఇది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇచ్చిన ఈ ఝులక్ అసలు రాజకీయాలనే కాకుండా..సినీ పరిశ్రమను..టీవీ షోలను కూడా ఊపేస్తోంది.

                          ఇప్పుడు ఏకంగా సినిమా పాటలో ఇది ఓ కీలక చరణంగా మారిపోయింది. ఇది చూసిన వారు ఎవరైనా వార్నీ..ఇలా కూడా చేస్తారా? అని అవాక్కు అవ్వాల్సిందే. అంత బాగా ఉంది మరి ఆ పాటలో ఈ చరణం. రాజ్ తరుణ్, హెబ్బాపటేల్ జోడీగా వస్తున్న ‘అందగాడు’ సినిమాలో ఈ పాట ఉంది. చూసి మీరూ ఎంజాయ్ చేయండి. పాట చాలా బాగుంది..పాటలో ఈ ఫిజిక్స్ చరణం ఇంకా బాగుంది.   ‘అంధగాడు ఆటకొచ్చాడే’ అంటూ సాగే ఈ పాటను  గీతామాధురి, సింహా కలిసి పాడారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ కు శేఖర్ చంద్ర బాణీలు సమకూర్చారు. సింగర్ గీతామాధురి ఈ సాంగ్‌ను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ సూపర్ పాట మీరూ ఓ సారి చూడండి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here