Home Andhra Pradesh రాయలసీమకు ‘రాజధాన్ని’ దూరం చేస్తున్న చంద్రబాబు

రాయలసీమకు ‘రాజధాన్ని’ దూరం చేస్తున్న చంద్రబాబు

chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ వేపై రివర్స్ గేర్ వేశారు. తొలుత భూ సేకరణ ఖర్చును తామే భరిస్తామని..ప్రాజెక్టును ఓకే చేయాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు..ఇప్పుడు మాట మార్చారు. భూ సేకరణ వ్యయాన్ని కూడా మీరే భరించాలని కేంద్రానికి మెలికిపెట్టారు. దీనికి కేంద్రం నో చెప్పేసింది. మీరు భూసేకరణకు అంగీకరించినందునే ప్రాజెక్టుకు ఓకే చెప్పాం కానీ..ఇప్పుడు మాట మారిస్తే ఎలా అంటూ కేంద్రం షాకిచ్చింది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మూలనపడే పరిస్థితి వచ్చింది. అంతే కాదు..రాయలసీమను నూతన ఏపీ రాజధాని అమరావతికి దూరం చేసినట్లు అయింది. అసలు రాయలసీమ వాసులు నూతన రాజధాని ప్రాంతం అయిన విజయవాడకు వెళ్ళాలంటే ఎంతో కష్టం. దీన్ని నివారించేందుకే ఆరులైన్ల ఎక్స్ ప్రెస్ ను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామని చంద్రబాబు ప్రతిపాదించారు. కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపటంతో ఇది కొంత ఆలశ్యం అయినా కార్యరూపం దాలుస్తుందని భావించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు భూ సేకరణ విషయంలో రివర్స్ గేర్ వేయటంతో ఇంచుమించు ఇది అటకెక్కినట్లే కన్పిస్తోందని ఆర్ అండ్ బి శాఖ వర్గాలు తెలిపాయి.  

                               తొలుత భూ సేకరణ చేస్తామని చెప్పిన సర్కారు…దీనికి మూడు వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని..అంత డబ్బు ఇప్పుడు తమ దగ్గర ఎక్కడ ఉందని వ్యాఖ్యానించటంతో అవాక్కు అవటం కేంద్రం వంతు అయింది. మీరు చేస్తామంటేనే కదా..మేం ఒప్పుకున్నది అని కేంద్రం వాదిస్తుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కరీతో మాట్లాడి చంద్రబాబు అప్పట్లో దీనికి ఓకే చేయించారు. ఈ రోడ్డుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను కూడా సిద్ధం చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ కంపెనీ రంగంలోకి దిగి తామే ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని అధికారుల వద్ద వ్యాఖ్యానించటంతో అవాక్కవటం వారి వంతు అయింది.  ప్రతిష్టాత్మకమైన ఈ రోడ్డు ప్రాజెక్టు టేకాఫ్ అవుతుందని భావించిన కొంత మంది ఎంపీలు..ఎమ్మెల్యేలు ఈ మార్గంలో పెద్ద ఎత్తున భూములు కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇది మూలనపడే అవకాశం ఉండటంతో వారు లబోదిబోమనాల్సిన పరిస్థితి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here