Home Telangana అడవిలో ‘కలెక్టర్’

అడవిలో ‘కలెక్టర్’

Amrapali, collctor

ఇదేదో సినిమా టైటిల్ కాదు. నిజంగానే జరిగిన సంఘటన. ఆ కలెక్టర్ మరెవరో కాదు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలినే. ఆమె  మరో సారి వార్తల్లో నిలిచారు. యువ కలెక్టర్ అయిన ఆమె ప్రకృతి ఆరాధకులే ఏమో కానీ..నిత్యం ట్రెక్కింగ్..అటవీ సందర్శనలతో హల్ చల్ చేస్తుంటారు. అలాంటిదిదే ఇది కూడా. నిత్యం చురుగ్గా ఉంటూ కార్యకలాపాలు నిర్వహించే అమె తాజాగా అడవుల్లో ట్రెక్కింగ్‌ చేశారు. ధర్మసాగర్‌ ఇనుపరాతి గుట్టలపై అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రెక్కింగ్‌ నిర్వహించారు.

                          విద్యార్థులు, ఔత్సాహికులతో కలిసి దేవునూర్‌ గుట్టలపై ట్రెక్కింగ్‌ చేశారు. పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆమ్రపాలి గతంలో కూడా ట్రెక్కింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. మహబూబాద్ జిల్లాలోని బయ్యారం చెరువు, పెద్ద గుట్టల్లో కలెక్టర్ ప్రీతీ మీనా, ఆమ్రపాలి కలిసి పర్యటించిన వీడియోలు సామాజిక మధ్యమాల్లో ఛల్ చల్ చేశాయి. మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్ట కొండలపై నిర్వహించిన రాక్‌ క్లైంబింగ్‌ ఫెస్టివల్‌‌లో ఆమ్రపాలి పాల్గొన్న విషయం తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here