Home Andhra Pradesh మరి 90 కోట్ల ‘మాకీ’ డిజైన్ల మాటేమిటి ?

మరి 90 కోట్ల ‘మాకీ’ డిజైన్ల మాటేమిటి ?

అందరిలో మదిలో ఇప్పుడు అదే అనుమానం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి అంశాన్ని రోజు రోజుకు మరింత సంక్లిష్టం చేస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం వివిధ దేశాలకు చెందిన సంస్థల నుంచి డిజైన్లను ఆహ్వానించారు. ప్రభుత్వం నియమించిన జ్యూరీ ఈ ఏడాది మార్చిలో జపాన్ సంస్థ మాకీ ఇచ్చిన డిజైన్లను ఓకే చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇవి చాలా బాగుతున్నాయని ప్రశంసించారు. అంతే కాదు సుమా…ఈ సంస్థకు డిజైన్లు ఇచ్చినందుకు 90 కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా నిర్ణయించారు. కానీ మాకీ సంస్థ ఇఛ్చిన డిజైన్లపై పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.  ఈ దెబ్బకు సర్కారు వెనక్కి తగ్గింది.

ఇప్పుడు కొత్తగా మలేషియాకు చెందిన ఆర్ డీ ఏ హారిస్ సంస్థ అమరావతికి కొత్త డిజైన్లు అందించింది. మాకీ సంస్థ ఇచ్చిన డిజైన్లతో పోలిస్తే ఇవే కాస్త బాగున్నాయని అన్పిస్తుంది. అయితే ఇందులోనూ అసెంబ్లీ భవనం డిజైన్ పైనా విమర్శలు విన్పిస్తున్నాయి. అదేదో ఎయిర్ పోర్టుల్లో ఉండే షెడ్డులా డిజైన్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే వీటిని ఖరారు చేసినట్లు సర్కారు ఎక్కడా ప్రకటించలేదు. కానీ 90 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకున్న మాకీ డిజైన్ల మాటేమిటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here