Home Andhra Pradesh అమరావతి కోసం మరో 14 వేల ఎకరాలు

అమరావతి కోసం మరో 14 వేల ఎకరాలు

amaravathi

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి అవసరాల కోసం సర్కారు 14 వేల ఎకరాలు సమీకరించేందుకు రెడీ అవుతోంది. గురువారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ  ‘యావత్ ఆంధ్రప్రదేశ్ ఆశ, శ్వాసగా భావిస్తున్న అమరావతి నిర్మాణం కళ్ల ముందు కనిపించాలి. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా పనులు జరగాలి’-అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎలా అయితే కళ్ల ముందు కనిపిస్తున్నాయో అమరావతి నగర నిర్మాణం కూడా ప్రజలకు కనిపించాలని అన్నారు. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలక నిర్మాణమైన అంతర్ వలయ రహదారి నిర్మాణం కోసం జులై తరువాత రెండవ దశ భూ సమీకరణకు సిద్ధమవ్వాలని సీయం సూచించారు. మలి విడత పూలింగ్‌లో 14 వేల ఎకరాల భూ సమీకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు సీఆర్‌డీఏ కమిషనర్ ముఖ్యమంత్రికి వివరించారు. 

                             ఇప్పటికే ఉన్నత విద్యారంగంలో విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి సంస్థలు వచ్చాయని, అదే స్థాయిలో రాజధానిలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాలయాలు కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పనులను వర్తించే 40 శాతం లేబర్ కాంపొనెంట్ ఏరియా అలవెన్స్ అమరావతి ప్రభుత్వ పరిపాలన నగరంలో జరిగే పనులకు కూడా వర్తింపజేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 918 ఎకరాలలో నిర్మిస్తున్న పరిపాలన నగరం ఫోస్టర్ ప్లస్ పార్టనర్స్ అండ్ కన్సార్టియం మాస్టర్ ప్లాన్, అర్బన్ డిజైన్ అందిస్తోందని, దాంతో పాటు మరో 454 ఎకరాలలో నిర్మించే జస్టిస్ సిటీకి కూడా ఈ సంస్థ నుంచే మాస్టర్ ప్లాన్, డిజైన్ తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
పరిపాలన నగరంలో భాగంగా 48 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నిర్మించబోయే సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల ఇంటిగ్రేటెడ్ డిజైన్ డెవలప్‌మెంట్ కోసం ఆర్కిటెక్టుగా ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కన్సార్టియంను ఎంపిక చేస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బిడ్డింగ్‌లో 3 సంస్థలు పోటీ పడగా ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌ సంస్థను ఎంపిక చేశారు. 9,22,594 చదరపు అడుగులలో సచివాలయం, 38,89,222 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌వోడీ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. 
అమరావతిని గ్రీన్ బిల్డింగ్ అండ్ సస్టెయినబుల్ ఎన్విరాన్‌మెంట్‌గా తీర్చిదిద్దడం కోసం ‘ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్’ (తెరి)ని కన్సల్టెంటుగా నియమిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

                                    ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వెంకటాయపాలెంలో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ సుజల పథకానికి పాలనాపరమైన అనుమతులు మంజూరుచేశారు. రాజధానిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్, 7 ప్రాధాన్య రహదారుల నిర్మాణ పురోగతిని సమావేశంలో ఏడీసీ సీయండీ లక్ష్మీపార్ధసారధి వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ఇప్పటికే రూ.200 కోట్లు హడ్కో నుంచి రుణంగా తీసుకున్నట్టు తెలిపారు. కొంతమంది ప్రభుత్వ అధికారులను జైకా అందించే సాంకేతిక శిక్షణ కోసం జపాన్ పంపేందుకు సమావేశం అంగీకరించిం
అమరావతి ఇక ఆవిష్కరణలకు కేంద్రం : సీయం చంద్రబాబు
తక్కువ ఖర్చుతో గృహనిర్మాణం, పర్యాటక అభివృద్ధి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సామర్ధ్యం పెంపు తదితర అంశాలలో సింగపూర్ సహకారాన్ని ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here