Home Andhra Pradesh అమరావతి సాక్షిగా ‘సెటిల్ మెంట్ల’కు చంద్రబాబు రెడీ

అమరావతి సాక్షిగా ‘సెటిల్ మెంట్ల’కు చంద్రబాబు రెడీ

amaravathi

ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమారావతి వైపు చూస్తోంది. సింగపూర్, జపాన్, చైనా..టోక్యో అంతా మనవైపే చూస్తున్నారు. ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న మొన్నటి వరకూ చెప్పిన మాటలు. ఇప్పుడు మాట మారింది. టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావటం లేదు. అందుకే మనమే అగ్రశ్రేణి సంస్థలతో మాట్లాడి వారిని ఇక్కడికి రప్పిద్దాం. నామ మాత్రపు రేట్లకే భూములు ఇద్దాం. రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములను చంద్రబాబు అండ్  కో తనకు నచ్చిన కంపెనీలకు నచ్చిన రేటుకు ఇస్తుందన్న మాట. అంటే స్విస్ ఛాలెంజ్ తరహాలోనే ఇందులోనూ భారీ గోల్ మాల్ కు రంగం సిద్ధం అవుతున్నట్లే. అంతర్జాతీయ విద్యాలయాలు, స్టార్ హోటళ్ల కోసం బిడ్డింగ్ పద్దతిన కాకుండా ప్రపంచ ప్రసిద్ధి చెందిన 15 సంస్థలతో సంప్రదింపులు జరిపి వారు అమరావతికి వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీలోని ఏ విద్యార్ధి కూడా విదేశాలకు వెళ్లి విద్యనభ్యసించాల్సిన అవసరం రాని విధంగా ప్రపంచ ప్రమాణాలు కలిగిన అంతర్జాతీయ విద్యాలయాలన్నీ ఇక్కడ కొలువు తీరేలా చూడాలన్నారు.  

                                 తొలుత నిర్ణయించిన ధర ప్రకారం ఎవరూ రాకపోతే…ధర తగ్గించి..మెరుగైన మౌలికసదుపాయాలు కల్పించి మళ్ళీ టెండర్లు పిలవాలి. కానీ సంప్రదింపుల ప్రకారం అంటే..చంద్రబాబుకు నచ్చిన  కంపెనీలు..లోకేష్ కు నచ్చిన స్టార్ హోటళ్లను పిలిచి వీళ్ళే ఇక్కడ ఓ సింగపూర్…జపాన్ లను సృష్టిస్తారంటే సరిపోతుందా?. అది అసలు ప్రభుత్వ విధానమా?. సంప్రదింపులు అంటే చంద్రబాబు తనకు నచ్చిన రేటుకు ఇస్తారన్న మాట. పైకి మంత్రుల కమిటీ అనో…మరో కమిటీ అనో చెప్పినా…ప్రభుత్వంలోని మంత్రులు..అధికారుల ఆయన మాట కాదనే పరిస్థితి ఉంటుందా.?. ఇదంతా చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘అమరావతి’ని ఓ కుంభకోణాల మయంగా తీర్చిదిద్దబోతున్నట్లు కన్పిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here