Home Cinema అల్లు అర్జున్ మళ్ళీ మొదలెట్టేశాడు

అల్లు అర్జున్ మళ్ళీ మొదలెట్టేశాడు

Allu-Arjun

ఓ పక్క దువ్వాడ జగన్నాథం సినిమా షూటింగ్ అలా పూర్తయిందో లేదో..అల్లు అర్జున్ మళ్ళీ మొదలెట్టేశాడు. బుధవారం నాడే కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ఈ హీరో దూకుడు చూపిస్తున్నాడు. వరస పెట్టి దక్కుతున్న హిట్లు కూడా ఆయనలో ఆత్మవిశ్వసాన్ని పెంచుతున్నాయి. అల్లు అర్జున్ నటించిన చిత్రాలు  ‘రేసు గుర్రం, సన్నాఫ్‌ సత్యమూర్తి, సరైనోడు’ సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. చూస్తుంటే దువ్వాడ జగన్నాథం కూడా హిట్ కొట్టేలాగే కన్పిస్తోంది. పాటలతో పాటు అల్లు అర్జున్ సీన్లు కూడా సూపర్బ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ హీరో కొత్తగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ముహుర్తం సన్నివేశంలో బుధవారం నాడు పాల్గొన్నారు.

                              ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది.  ‘కిక్, రేసుగుర్రం, టెంపర్‌’ చిత్రాలకు కథ అందించిన వక్కంతం వంశీ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. మెగా బ్రదర్‌ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్‌ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, తల్లి నిర్మల క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ అందించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here