Home Telugu ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ 1399 రూపాయలే

ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ 1399 రూపాయలే

Airtel smart phone

జియో ఏది చేస్తే ఎయిర్ టెల్ అదే చేస్తోంది. ప్యాకేజీలు మారిస్తే తనూ అంతే అంటోంది. రిలయన్స్ జియో స్మార్ట్ ఫోన్ ప్రకటించగానే…ఎయిర్ టైల్ కూడా అదే పనిచేసింది. అంతే కాదు..స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు ఏకంగా మార్కెట్లోకి విడుదల చేసంది. ఈ ఫోన్ ధర 1399 రూపాయలుగా నిర్ణయించారు. అదీ 4జీ సౌకర్యాలతో కూడిన స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ల కోసం హ్యాండ్‌సెట్‌ తయారీదారి కార్బన్‌ మొబైల్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లుత తెలిపింది.  4జీ స్మార్ట్‌ ఫోన్‌ ధర, ఫీచర్‌ ఫోన్‌ ధర ఒకేలా ఉంచేలా తన స్మార్ట్‌ ఫోన్‌ను ఎయిర్‌టెల్‌ రంగంలోకి దింపింది. ఆండ్రాయిడ్‌ ఆధారితంగా వస్తున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫుల్‌ టచ్‌ స్క్రీన్‌, డ్యూయల్‌ సిమ్‌ స్లాట్లు, యూట్యూట్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వంటి పాపులర్‌ యాప్స్‌ సపోర్టును అందిస్తోంది.

                   ఎయిర్ టెల్ స్మార్ట్‌ ఫోన్‌ పేరు కార్బన్‌ ఏ40 ఇండియన్‌గా నిర్ణయించినట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. దీని ధర రూ.1,399గా పేర్కొంది. నెలవారీ రూ.169 రీఛార్జ్‌ ప్యాక్‌తో డేటా ఆఫర్లు, పలు ప్రయోజనాలను ఈ ఫోన్‌పై ఆఫర్‌ చేస్తోంది. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే స్టాక్స్‌ అందుబాటులో ఉన్నాయని, దగ్గర్లోని కార్బన్‌ రిటైల్‌ స్టోర్‌లో వీటిని పొందవచ్చని కూడా ఎయిర్‌టెల్‌ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అత్యధిక వేగవంతంగా డేటాను యాక్సస్‌ చేసుకునేలా ప్రతి భారతీయుడికి డిజిటల్‌ సాధికారిక కల్పించాలని ఎయిర్‌టెల్‌ లక్ష్యంగా పెట్టుకుందని భారతీ ఎయిర్‌టెల్‌ సీఎంఓ రాజ్‌ పుదిపేడి తెలిపారు. కస్టమర్లు ఈ స్మార్ట్‌ ఫోన్‌ కోసం రూ.2,899ను డౌన్‌పేమెంట్‌ చేయాల్సి ఉందని, దీంతో 36 నెలలు కొనసాగింపుగా నెలవారీ రూ.169తో రీఛార్జ్‌ అవుతూ ఉంటుందని తెలిపింది. 18 నెలల అనంతరం రూ.500 క్యాష్‌ రీఫండ్‌, 36 నెలల తర్వాత మరో రూ.1000 అంటే మొత్తంగా రూ.1500 ప్రయోజనాలు పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here