Home Telugu ఎయిర్‌కోస్టాకు మరో ఎదురుదెబ్బ

ఎయిర్‌కోస్టాకు మరో ఎదురుదెబ్బ

Aircoasta

ప్రాంతీయ విమానయానసేవల సంస్థ ఎయిర్‌కోస్టాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. నేలపట్టునే ఉంటున్న కంపెనీకి చెందిన రెండు విమాన సర్వీసుల రిజిస్ట్రేషన్‌ను రద్దుచేస్తున్నట్లు విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ ప్రకటించింది. సివిల్ ఎయిర్‌క్రాఫ్ట్ రిజిస్ట్రేషన్ పరిధి నుంచి కంపెనీకి చెందిన రెండు ఎంబ్రాయిర్ విమాన లైసెన్స్‌ లను తొలగించినట్లు డీజీసీఏ వర్గాలు వెల్లడించాయి. విజయవాడ కేంద్రస్థానంగా విమాన సేవలు అందిస్తున్న ఎయిర్‌కోస్టా  నగదు కొరత, ఎయిర్‌క్రాఫ్ట్ లీజుదారుల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాల కారణంగా ఫిబ్రవరి నుంచే విమాన సర్వీసులను రద్దు చేసింది. మే వరకు టిక్కెట్ల బుకింగ్‌లను కూడా నిలిపివేసింది.

                         డీజీసీఏ తీసుకున్న ఈ తాజా చర్య సంస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు కంపెనీలో పనిచేస్తున్న 450 మంది ఉద్యోగులకు ఎలాంటి వేతనాలు చెల్లించలేదు. వీరిలో 40 మంది పైలెట్లు ఉన్నారు. ఎయిర్‌కోస్టాకు వ్యతిరేకంగా విజయవాడలోని ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపేయోచనలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సంస్థ నెలకు రూ.4 కోట్లు వేతన రూపంలో చెల్లింపులు జరుపుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here