Home Latest News ఆ నటిని ఫేస్ బుక్ ‘బుక్ చేసింది’

ఆ నటిని ఫేస్ బుక్ ‘బుక్ చేసింది’

ఫేస్ బుక్ లో ఎందరో అమాయకులు ‘బుక్’ అవుతున్నారు. అందులో సినీ నటీమణులు కూడా ఉంటున్నారు. హైదరాబాద్ లో అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.  ఫేస్ బుక్ లో పరిచయం అయిన అబ్బాయితో ప్రేమాయణం సాగించి..సన్నిహితంగా మెలగటంతో ఆమె గర్భం దాల్చింది. నాలుగు గదుల మధ్య పెళ్లి చేసుకున్నట్లు చేసుకుని..ఆమెకు దగ్గరయ్యాడు. గర్భం దాల్చాక ఆస్పత్రికి తీసుకెళ్ళి అబార్షన్ చేయించాడు. తర్వాత పెళ్లికి బలవంతం చేయటంతో అతగాడు నిరాకరించి…ఉడాయించాడు. దీంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. సినీ నటిని మోసం చేసిన బీటెక్‌ విద్యార్థిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.     

                          హైదరాబాద్ లోని రహ్మత్‌నగర్‌లో నివాసం ఉండే యువతి(23) సినీ నటిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ గా పనిచేస్తోంది. గుంటూరు జిల్లా వేల్పూరు గ్రామానికి చెందిన మేడ యశ్వంత్‌కుమార్‌ అనే బీటెక్‌ విద్యార్థితో 2014లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ రహ్మత్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. 2016 డిసెంబర్‌ 2న యశ్వంత్‌కుమార్‌ అదే గదిలో ఆమెకు పసుపుతాడు కట్టి పెళ్ళి చేసుకున్నట్లు నమ్మించి శారీరకంగా దగ్గరయ్యారు. ఇటీవల ఆమె గర్భవతికాగా స్థానిక ఆస్పత్రికి తీసుకెల్లి అబార్షన్‌ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, అందుకు అతడు నిరాకరించడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యశ్వంత్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here