Home Latest News వాహనం కొనుగోలుకు ‘ఆధార్’ తప్పనిసరి

వాహనం కొనుగోలుకు ‘ఆధార్’ తప్పనిసరి

aadhar

ఇక ఆధారే అన్నింటికి ఆధారం అన్నట్లు తయారైంది పరిస్థితి. లేకపోతే బండి ముందుకు నడిచేలా లేదు. తెలంగాణ సర్కారు కొత్తగా ఓ నిర్ణయం తీసుకుంది. అంటే బండి కొనుగోలుకు ఇబ్బంది ఏమీలేకపోయినా..రిజిస్ట్రేషన్ కు మాత్రం ఆధార్ తప్పనిసరి అంట. అంటే బండి కొనుగోలు చేయాలంటే ఆధార్ తప్పనిసరి కానుంది. వాహనాల రిజిస్ట్రేషన్, యాజమాన్య బదిలీలలో ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి చేయాలని  తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆదేశించారు.

                            వాహనాలను ఇతరులకు అమ్మినప్పుడు అవి కొన్నవారి పేరుపైకి బదిలీకావాల్సి ఉందని, కానీ ఇది జరగకపోవటం వల్ల బీమా పొందడం, పోలీసు కేసులు లాంటి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. దీన్ని అధికారులు తీవ్రంగా పరిగణించి, కొన్నవారి పేరుపై వాహనాలు బదిలీ అయ్యేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here