Telugu Gateway
Politics

నాలుగు సర్వేల్లోనూ టీడీపీదే గెలుపు

నాలుగు సర్వేల్లోనూ టీడీపీదే గెలుపు
X

‘నాలుగు సర్వేలు చేయించాం. అన్నింటిలోనూ టీడీపీదే గెలుపు అని వచ్చింది. ఓడిపోతామని తెలిసి కూడా వైసిపి బుకాయిస్తోంది. గత ఎన్నికల్లోనూ ఇలాగే డ్రామా ఆడారు. మే 23న కౌంటింగ్ లో టిడిపి గెలుపు లాంఛనం మాత్రమే. ఏపిలో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం. మళ్లీ నరేంద్రమోడి ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు. దేశంలో బిజెపి ఓటమి ఖాయం అయ్యింది.’ అని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం నాడు నంద్యాల పార్లమెంటరీ సమీక్షలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మనం చేసిన కార్యక్రమాలే మనకు శ్రీరామ రక్ష. ప్రకృతి మనకు బాగా కలిసివచ్చింది. లబ్దిదారులకు చేయాల్సినంత సంక్షేమం చేశాం. ఈ ఎన్నికలు మే నెలలో రావాల్సివుంది.

తొలిదశలో ఎన్నికపెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. స్వల్ప గడువుతో టిడిపిని దెబ్బతీయాలని అనుకున్నారు. కానీ అదే తెలుగుదేశం పార్టీకి బాగా కలిసివచ్చింది. చెడు చేయాలని అనుకున్నా టిడిపికి మంచే జరిగింది. ప్రతి నెలా తొలివారంలో లబ్దిదారులకు పించన్లు, ఆర్ధిక సాయం పడతాయి. రెండవ వారంలో ఏపి ఎన్నిక రావడం టిడిపికి మేలైంది. మంచికి మారుపేరు తెలుగుదేశం పార్టీ. దుర్మార్గాలకు మారుపేరు వైసిపి, బిజెపి. మోడి పాలనలో ఏపికి జరిగిన అన్యాయంపై పోరాడాం. గత 5ఏళ్లలో దేశానికి జరిగిన నష్టంపై పోరాడాం. బిజెపికి వ్యతిరేకంగా అన్నిపార్టీలను ఏకం చేశామని తెలిపారు.

Next Story
Share it