Telugu Gateway
Politics

వీవీప్యాట్ల‌పై మ‌రోసారి ఎదురుదెబ్బ‌

వీవీప్యాట్ల‌పై మ‌రోసారి ఎదురుదెబ్బ‌
X

ఎన్నిక‌ల‌పై విశ్వాసం క‌ల్పించేందుకు వంద శాతం వీవీ ప్యాట్ ల‌ను లెక్కించాల‌న్న అభ్య‌ర్ధ‌న‌ను సుప్రీంకోర్టు మ‌రోసారి తోసిపుచ్చింది ఇలాంటి పిటీష‌న్ల‌ను మ‌రోసారి ఆమోదించ‌మ‌ని తేల్చిచెప్పింది. దీంతో చంద్ర‌బాబు అండ్ టీమ్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం ఫ‌లించే అవ‌కాశం లేద‌ని తేలిపోయింది. వందశాతం వీవీప్యాట్లను లెక్కించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. టెక్ ఫ‌ర్ ఆల్ అనే సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్‌ లేదని వెకేషణ్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, ఇది న్యూసెన్స్ పిటిషన్‌ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఎన్డీయేతర 21 విపక్ష పార్టీల నాయకులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్లనే మొదట లెక్కించి తర్వాత ఈవీఎంలను లెక్కించాలని.. ఈవీఎం, వీవీప్యాట్లలో నమోదైన ఓట్ల మధ్య తేడాలుంటే నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరనున్నట్లు తెలుస్తోంది. వీవీప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు ఇదివరకే ఎదురుదెబ్బ తగిలిన విషయంతెలిసిందే.

Next Story
Share it