Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

వివాదంలో రకుల్ ప్రీత్ సింగ్ ’సీన్’

0

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత స్పీడ్ పెంచినట్లు కన్పిస్తోంది. టాలీవుడ్ లోనూ ఆమె పలు సినిమాల్లో హాట్ హాట్ గా నటించటానికి పెద్దగా అభ్యంతరాలు చెప్పిన దాఖలాలు లేవు. అదేమంటే కథ డిమాండ్ చేసింది అంటారు. సరే ఈ సంగతి కాస్త పక్కన పెడితే ఇఫ్పుడు రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో ‘దే దే ప్యార్ దే’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఓ పాట సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ అందాల అరబోతతోపాటు నడుముపై మద్యం సీసాను పెట్టుకుని ఉంటుంది. ఓ సందర్భంలో ఆ బాటిల్ తాగుతున్నట్లు కూడా చూపించారు.. అయితే ఈ సీన్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సి) అభ్యంతరం వ్యక్తం చేసింది. బాటిల్ ప్లేస్ లో  పూల బొకే పెట్టుకోమని సలహా ఇచ్చింది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ హీరోగా నటిస్తున్నారు.

- Advertisement -

అవసరమైన మార్పులు చేస్తేనే క్లియరెన్స్ ఇస్తామని తేల్చిచెప్పగా..ఇందుకు చిత్ర యూనిట్ కూడా రెడీ అయినట్లు సమాచారం. సీన్లు తొలగించమని చెప్పటంతోపాటు..ద్వందార్ధాలతో కూడిన డైలాగ్ ను కూడా తొలగించమని సూచించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి వివాదాలను ఎదుర్కొంటోంది. ట్రైలర్ విడుదల సమయంలో కూడా మీటూలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాధ్ ను ఎలా తీసుకుంటారని అజయ్ దేవ్ గన్ ను పెద్ద ఎత్తున ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమాలో టబు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.