Telugu Gateway
Andhra Pradesh

ఫలితాలకు ముందే ‘నేను పాస్’ అంటున్న చంద్రబాబు’

ఫలితాలకు ముందే ‘నేను పాస్’ అంటున్న చంద్రబాబు’
X

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను సమస్యల్లోకి నెడుతున్నారు. నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉండగా..అధికారులు సమీక్షా సమావేశాలకు హాజరు కాకూడదు. ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ఆదేశాలను కూడా పాటించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు సమీక్షలు అంటూ హడావుడి చేసి మళ్లీ వెనక్కితగ్గారు. ఆయన తర్వాత మంత్రి సోమిరెడ్డి చంద్రబాబునాయుడు సమీక్ష అంటూ హంగామా చేసి అధికారులను ఇరకాటంలోకి పడేశారు. మంత్రులు పిలిచినా అధికారులు రావటం లేదంటూ తమ పరువు తామే తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ సమయంలో అధికారులు అనుసరించాల్సిన నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉదాహరణకు ముఖ్యమంత్రి, మంత్రి సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటారు. బాగానే ఉంటుంది. దానికి అవసరమైన నిధులు ఎవరు ఇవ్వాలి?. ఎన్నికలు పూర్తయి...గెలుస్తారో..గెలవని సీఎం, మంత్రులు ఆదేశాలు పాటించాలా?. లేక అమల్లో ఉన్న నిబంధనలు పాటించాలా?. ప్రజల తీర్పు కోరి.. ఆ తీర్పు వచ్చే సమయం వరకూ కూడా వేచిచూడకుండా నేను పరిపాలన చేస్తా...అధికారం చలాయిస్తా అనటమే అనైతికం అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

నిజంగా చంద్రబాబుకు పోలవరంలో అయినా..మరెక్కడైనా కేవలం పనే పూర్తి చేయాలనుకుంటే...అధికారుల ఫోన్ చేసి సలహాలు..సూచనలు ఇవ్వటం తప్పు కాదని..కానీ ఏకంగా ఫీల్డ్ కు వెళ్లి సమీక్ష చేస్తా..ఆదేశాలు జారీ చేస్తా అనటం మాత్రం సహేతుకంకాదని వ్యాఖ్యానిస్తున్నారు. గత ఐదేళ్లలో ఏ అధికారి అయినా అటు చంద్రబాబు కానీ..ఇటు మంత్రుల ఆదేశాలను కాదన్నారా?. సహజంగా ఎన్నికైన ప్రభుత్వంలో మంత్రులు..కేబినెట్ మాటే చెల్లుబాటు అవుతుంది. అయితే అధికారులు తాము రాయాల్సిన విషయాలను పైలులో రాసేసి..నిర్ణయాన్ని మంత్రులు..ముఖ్యమంత్రికి వదిలేస్తారు. కానీ ‘కోడ్’ సమయంలో కూడా ఎప్పటిలాగానే తాను చేస్తానని ఓ ముఖ్యమంత్రి ప్రతి రోజూ మీడియా సమావేశాలు పెట్టడం చూసే ప్రజలే అవాక్కు అవ్వాల్సిన పరిస్థితి.

Next Story
Share it