Telugu Gateway
Cinema

‘మహర్షి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

‘మహర్షి’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
X

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా పై డివైడ్ టాక్ వచ్చింది. చిత్ర నిర్మాతలు..దర్శకుడు వంశీ పైడిపల్లి మాత్రం మహేష్ బాబు 25వ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రకటించారు. అయితే సినిమాలో కథ ఇప్పటికే పలు సినిమాల్లో చూసిందే కావటంతో ప్రేక్షకులు ఒకింత నిరాశకు గురయ్యారు. అయినా కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. దీనికి కేవలం ఈ సినిమాకే రేట్లు పెంచటం కూడా కలిసొచ్చిందనే చెప్పొచ్చు.

మహర్షి తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 24.6 కోట్ల షేర్‌ సాధించింది. ఓవర్‌ సీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల వసూళ్లు కూడా కలుపుకుంటే మరింత పెరిగే అవకాశం ఉంది. మహర్షి ప్రాంతాల వారీ వసూళ్ల వివరాలను సూపర్ హిట్ కు చెందిన బీఏ రాజు ట్విట్టర్ లో షేర్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు.

Next Story
Share it