Telugu Gateway
Telangana

కెసీఆర్ ది ‘టెంపుల్’ టూరే

కెసీఆర్ ది ‘టెంపుల్’ టూరే
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ చెన్నయ్ పర్యటనపై డీఎంకె అధినేత స్టాలిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ కేవలం దైవదర్శనాల కోసమే వచ్చారని అన్నారు. అంతే కానీ కూటమి ఏర్పాటు చేసేందుకు కాదని వ్యాఖ్యానించారు. మర్యాదపూర్వకంగా కలిసేందుకే తన అపాయింట్ మెంట్ కోరారని..అంతకు మించి ఏమీలేదన్నారు.

దేశంలో ప్రస్తుతం థర్డ్ ఫ్రంట్ కు ఛాన్స్ లేదని స్టాలిన్ వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బిజెపియేతర కూటమికి ఎలాంటి అవకాశాలు ఉండవన్నారు. మే 23 తర్వాతే కూటములపై స్పష్టత వస్తుందని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బిజెపి మద్దతు లేకుండా ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ఛాన్స్ లేదన్నారు. స్టాలిన్ మొదటి నుంచి కాంగ్రెస్ మద్దతుగా మాట్లాడుతున్నారు. అంతే కాదు ఓ అడుగు ముందుకేసి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా కూడా ప్రకటించారు స్టాలిన్. దీంతో డీఎంకె కాంగ్రెస్ ను వీడి బయటకు వచ్చే అవకాశాలు లేవనేది స్పష్టంగా కన్పిస్తోంది.

Next Story
Share it