Telugu Gateway
Latest News

ట్రంప్ కొత్త పాలసీ...‘బిల్డ్ అమెరికా వీసా’

ట్రంప్ కొత్త పాలసీ...‘బిల్డ్ అమెరికా వీసా’
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంలో కీలక మార్పులు ప్రతిపాదించారు. ఇప్పటి వరకూ ఉన్న గ్రీన్ కార్డు స్థానంలో ‘బిల్డ్ అమెరికా వీసా’ విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఇందులో అత్యంత ముఖ్యమైనది ‘ప్రతిభే’. ప్రతిభ ఆధారంగా పాయింట్లు ఇఛ్చి...వాటి ఆధారంగా వీసాలు మంజూరు చేయనున్నారు. ఈ నూతన విధానం అమల్లోకి వస్తే భారతీయ నిఫుణులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. అత్యున్నతస్థాయి నైపుణ్యమున్న విదేశీయులకు జారీచేస్తున్న వీసాలను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచుతామన్నారు. కెనడా సహా పలు అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఈ కొత్త వలసవిధానంలో పాయింట్లు కేటాయిస్తామని తెలిపారు. ‘ఈ విధానం కింద అభ్యర్థుల వయసు, నైపుణ్యం, ప్రతిభ, ఉద్యోగ అవకాశాలు, అమెరికా రాజ్యాంగం, ప్రభుత్వ పనితీరు, చరిత్రపై అవగాహన, ఇంగ్లిష్‌లో తప్పనిసరి ఉత్తీర్ణత ఆధారంగా పాయింట్లు కేటాయిస్తాం. ప్రస్తుతం అమెరికా వలసవిధానం లోపభూయిష్టంగా ఉంది.

దీనికారణంగా ప్రపంచంలోనే అత్యుత్తమ కళాశాలల్లో మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులకు కూడా ఓ డాక్టర్‌గా, పరిశోధకుడిగా, విద్యార్థిగా మనం అవకాశం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ కొత్తవిధానం ఓసారి ఆమోదం పొందితే నైపుణ్యవంతుల్ని ఆకర్షించే విషయంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది’ అని ట్రంప్‌ తెలిపారు. ట్రంప్‌ ప్రకటించిన నూతన వలస విధానంపై మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొత్త విధానంలో నైపుణ్యవంతులైన విదేశీ కార్మికులకు గ్రీన్‌కార్డుల్లో 57 శాతం కేటాయిస్తామని ట్రంప్‌ ప్రకటించడం కీలక పరిణామంగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డు కోసం ఒక్కో భారతీయుడు పదేళ్ల పాటు వేచిచూడాల్సి వస్తోంది. కొత్తవిధానంలో వీరందరికీ త్వరితగతిన గ్రీన్‌కార్డులు మంజూరు అవుతాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Next Story
Share it