Telugu Gateway
Cinema

‘అదితి రావు’ ‘షాకింగ్’ ఫోటోలు

‘అదితి రావు’ ‘షాకింగ్’ ఫోటోలు
X

అదితి రావుహైదరి. విలక్షణ నటి. విభిన్న పాత్రలు చేస్తూ పలు భాషా చిత్రాల్లో తన సత్తా చాటుతోంది. కేవలం హీరోయిన్ పాత్రలు..గ్లామర్ షో కోసమే కాకుండా కథకు అనుగుణంగా పాత్రలు ఒప్పుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అదితిరావు హైదరీ అందం కూడా ఓ భిన్నమైన అందం. తాజాగా ఆమె కొన్ని సంచలన విషయాలను వెల్లడించింది. అదేంటి అంటే ఆమెకు గూగుల్ లో ఫోటోలు సెర్చ్ చేయటం అంటే షాక్ అంట. ఎందుకంటే ఓ సారి ఆమె చేసిన పని చూసి ఆమెకే షాక్ కొట్టింది మరి. ఎందుకంటే ఆమెకు సంబంధించిన ఫోటోలు కొన్ని దుస్తులు లేకుండా ఉన్నాయట. అవి చూసి తానే షాక్ కు గురయ్యానని..అప్పటి నుంచి గూగూల్ లో ఫోటోలు వెతికే పని మానేసినట్లు తెలిపారు.

ఈ వార్త ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సహజంగా హీరోయిన్ల ఫోటోల కోసం నెట్ లో వెతికే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. హీరోలతో పోలిస్తే హీరోయిన్ల ఫోటోలకే డిమాండ్ ఎక్కువ అనే విషయం తెలిసిందే. అందునా గ్లామర్ హీరోయిన్స్ అంటే ఆ క్రేజీ వేరు. కానీ ఏకంగా అదితి రావు హైదరీకే స్వీయ అనుభవం షాక్ ఇవ్వటంతో ఆమె ఆ పని మానేసింది. అదితి తెలుగులో చేసిన తాజా చిత్రం అంతరిక్షం. తొలి సినిమా ‘చెలియా’. ఈ భామ ఇప్పుడు వీ చిత్రంలో చేస్తోంది.

Next Story
Share it