Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

ఏబీసీడీకి ‘క్లీన్ యూ సర్టిఫికెట్’

0

అల్లు శిరీష్ నటిస్తున్న కొత్త సినిమా విడుదలకు రెడీ అయింది. చాలా గ్యాప్ తర్వాత ఈ హీరో చేస్తున్న సినిమా కావటంతో అందరితో ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘క్లీన్ యూ’ సర్టిఫికెట్ దక్కించుకుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది ఆదరిస్తుందని చెబుతున్నారు. అల్లు శిరీష్, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన సినిమానే  ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశిఅన్నది ఉపశీర్షిక. ఈ చిత్రంతో సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

- Advertisement -

                     సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై మధురశ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మించిన ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఎన్నారై పాత్రలో అల్లు శిరీష్, అతని స్నేహితుడి భరత్‌ నటన ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Leave A Reply

Your email address will not be published.