Telugu Gateway
Cinema

కాస్కోండి..వర్మ నటిస్తున్నారట!

కాస్కోండి..వర్మ నటిస్తున్నారట!
X

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిత్యం వివాదాల్లో ఉండే ఈ వివాదస్పద దర్శకుడు ఇప్పుడు వెండి తెరపై కొత్త పాత్ర పోషించబోతున్నారు. ఇంత కాలం దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరించిన ఆయన తొలిసారి నటనా రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆదివారం నాడు పుట్టిన రోజు జరుపుకుంటున్న వర్మ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గన్‌ షాట్‌ ఫిలింస్‌ సంస్థ తన తొలి ప్రయత్నంగా కోబ్రా అనే చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఈ ప్రాజెక్ట్‌ తో తొలిసారిగా వర్మ నటుడిగా వెండితెరకు పరిచయం కానున్నాడు.

పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మంచి టాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో ఈ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్ వేయటం వర్మను నిరాశకు గురిచేసింది. సినీ రంగంలో పలు విభాగాల్లో ప్రవేశించిన వర్మ..ఇప్పుడు నటుడిగా ఎన్ని సంచలనాలు నమోదు చేస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it