Telugu Gateway
Politics

మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు

మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు
X

తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచి దేశ వ్యాప్తంగా చర్చకు కారణమైన రైతులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రైతులకు గిట్టు బాటు ధర కల్పించటంతోపాటు..నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటులో ఫ్రభుత్వం వైఫల్యం చెందినందుకు వీరు లోక్ సభ బరిలో నిలిచి రాజకీయంగా కాక పుట్టించారు. అదే రైతులు ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ బరిలో నిలవనున్న వారణాసి నియోజకవర్గం నుంచి పోటీకి రెడీ అయ్యారు. దీంతో ఇప్పుడు ఇది మరింత ఆసక్తికర పరిణామంగా మారింది. నామినేషన్లు వేసేందుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన 50 మంది రైతులు "చలో వారణాసి" నినాదంతో బయలుదేరారు.

పసుపు బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కి నిరసనగా మోడీ పై పోటీ చేసేందుకు వారణాసి బయల్దేరారు. వీరికి మద్దతుగా తమిళనాడు రైతులు కూడా చలో వారణాసి అంటూ బరిలో దిగనున్నారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని టీఆర్ఎస్ అభ్యర్థి కవితను లక్ష్యంగా చేసుకొని విమర్శించారని..దీంతో తమ లక్ష్యం నిర్వీర్యం అయ్యిందని రైతలు వ్యాఖ్యానించారు. తాము పోటీ చేసేది సమస్యల కోసమే తప్ప..రాజకీయాల కోసం కాదన్నారు. బీజేపీ పసుపు బోర్డు ఇస్తామని చెప్పి మోసం చేసింది. అందుకే మేము మోడీపై పోటీ చేసి జాతీయ పార్టీల నేతలను కలుస్తాం అని రైతులు ప్రకటించారు.

Next Story
Share it