Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘మహర్షి’ షూటింగ్ పూర్తి

0

మహేష్ బాబు, పూజా హెగ్డె జంటగా నటిస్తున్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో అల్లరి నరేష్ మహేష్ బాబుకు స్నేహితుడిగా నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తయిపోయిన విషయాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ‘ఇట్స్ ఏ ర్యాప్’ అంటూ పూలు..కేక్ తో కూడిన ఫోటోను షేర్ చేశారు. ఈ సినిమా మే9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సమ్మర్ లో సందడి చేయనున్న పెద్ద సినిమా కూడా ఇదొక్కటే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సక్సెస్ ఫుల్ పారిశ్రామికవేత్తగా నటించినట్లు స్పష్టం అవుతోంది.

- Advertisement -

దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా..ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు సంయుక్తంగా తెరకెక్కించారు. షూటింగ్ పూర్తయి..విడుదల తేదీ దగ్గరకు వస్తుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ జోరు పెంచింది. ఈ శుక్రవారం నాడు ‘ఎవరెస్ట్ అంచున’ సాగే పాట వీడియో ప్రివ్యూను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.