Telugu Gateway
Cinema

‘హిప్పీ’ రిలీజ్ డేట్ ఫిక్స్

‘హిప్పీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కార్తికేయ. కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు టిఎన్‌ కృష్ణ దర్శకుడు. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ 7న సినిమాను విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్‌. కబాలి వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్‌. థానుగారి సంస్థలో హిప్పీ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు కార్తికేయ.

ఆయ‌న ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద బ‌డ్జెట్ చిత్రంలా చేశారు. జె.డి. చ‌క్రవ‌ర్తిది చాలా చాలా కీ రోల్‌. ఆయ‌న క‌థ విన‌గానే ఒప్పుకోవ‌డంతో హ్యాపీగా ఫీల‌య్యా. ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్‌. అంద‌రినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్‌.డి. రాజశేఖర్‌గారి ఫొటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది’ అన్నారు.

Next Story
Share it