Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘కల్కి’ టీజర్ విడుదల

0

రాజశేఖర్ చాలా గ్యాప్ తర్వాత హీరోగా  చేసిన సినిమానే ‘కల్కి’. ఈ సినిమాలో అదా శర్మ, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. వినూత్న కథతో ‘అ!’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మే ఈ సినిమా దర్శకుడు. సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవటంతో చిత్ర యూనిట్ ప్రచారంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా బుధవారం ఉదయం పది గంటల పది నిమిషాల పది సెకన్లను చిత్ర టీజర్ ను విడుదల చేశారు.

1983 నేపథ్యంలో క్రైమ్‌ థ్రిల్లర్‌ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్‌ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రాజశేఖర్ హీరోగా నటించిన గరుడవేగ సినిమా మంచి  సక్సెస్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదో జోష్ తో రాజశేఖర్ ఈ సినిమాలో హీరోగా నటించటంతోపాటు..నిర్మాణంలోనూ భాగస్వామి అయ్యారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.