Telugu Gateway
Politics

ఎన్నికల ఖర్చుపై జె సీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ఖర్చుపై జె సీ సంచలన వ్యాఖ్యలు
X

తాజాగా ముగిసిన ఎన్నికల వ్యయంపై ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ సారి బరిలో లేనని..అయినా తన నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల వ్యయం అయిందని వ్యాఖ్యానించారు. ఈ పద్దతిలో మార్పు రాకపోతే ప్రమాదమే అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి ఏకంగా పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని జె సీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్కో అభ్యర్ధి 25 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు చేశారని అన్నారు. ఓటు అడిగితే రెండు వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని ఓటర్లు అడుగుతున్నారని..ఇది రాబోయే రోజుల్లో ఐదు వేల రూపాయలకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.

తెలుగుదేశం పార్టీ ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ప్రజలు అవేమీ పట్టించుకోలేదన్నారు. అయితే పసుపు-కుంకుమ, వృద్ధాప్య పించన్లే టీడీపీని గెలిపిస్తాయని వ్యాఖ్యానించారు. తిరిగి చంద్రబాబు అధికారంలోకి రావటం ఖాయం అని జె సీ వ్యాఖ్యానించారు. తాను రాబోయే రోజుల్లో మేధావులతో కలసి ఎన్నికల వ్యయం తగ్గించే అంశంపై కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడం తగ్గించాలనేదే తన టార్గెట్ అని వ్యాఖ్యానించారు. డబ్బులు ఇవ్వకుండా చేసిన పనులు చెప్పుకోవటం ద్వారానే ఓట్లు అడిగే పరిస్థితి రావాలన్నారు.టీడీపీ గాలి ముందు ప్రత్యర్ధులు ఎగిరిపోతారన్నారు.

Next Story
Share it