Telugu Gateway
Politics

డిజైన్లలో కూడా చంద్రబాబు ‘దోపిడీ డిజైన్’

డిజైన్లలో కూడా చంద్రబాబు ‘దోపిడీ డిజైన్’
X

నాలుగు భవనాల డిజైన్లకు 250 కోట్లు

సర్కారు సొమ్మును దోపిడీ చేసే ఓ ఒక్క ఛాన్స్ ను కూడా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వదులుకున్నట్లు కన్పించటంలేదు. తన సీనియారిటీ మొత్తాన్ని ఇందుకే వాడుకున్నట్లు స్పష్టంగా కన్పిస్తోంది. మాకీ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ తాము 90 కోట్ల రూపాయలతో అమరావతికి డిజైన్లు ఇస్తామంటే..రేటు చాలా ఎక్కువ చెప్పారు వద్దు వద్దంటూ పక్కకు పంపించేశారు. అసలు కారణం ఏంటి అంటే చంద్రబాబు అండ్ కో చెప్పిన వాళ్ళను భాగస్వాములుగా చేర్చుకోవటానికి ఆ సంస్థ అంగీకరించకపోవటమే. చివరకు నార్మన్ ఫోస్టర్ ను తెరపైకి తెచ్చి ఇందులో భారీ ఎత్తున దోపిడీ చేశారు. మాకీ వంటి సంస్థ డిజైన్లకు 90 కోట్ల రూపాయలు అవుతుంది అంటే..అదే ఎక్కువ అని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆ మొత్తాన్ని ఏకంగా 250 కోట్ల రూపాయలకు ఎలా పెంచారు?. ఎందుకు పెంచారు?. సింపుల్ రీజన్. డిజైన్లలో కూడా చంద్రబాబు ‘దోపిడీ డిజైన్’ ఉండటమే దీనికి కారణం. కేవలం పెంచేసి ఊరుకోలేదు. ఏకంగా డిజైన్లకు సంబంధించి 210 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా చేసేశారు.

ఇంకా మరో నలభై కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. మాకీని బయటకు పంపిన తర్వాత సర్కారు నార్మన్ అండ్ ఫోస్టర్ ను తెరపైకి తెచ్చింది. ఈ సంస్థకు భారతీయ భాగస్వామిగా హఫీజ్ కాంట్రాక్టర్ ను తెరపైకి తెచ్చారు. మధ్యలో జెనిసిస్ అనే సంస్థ కూడా ఎంట్రీ అయింది. ఇదే ఇక్కడ కీలకం. అంతర్జాతీయంగా పేరెన్నికగన్న సంస్థ నార్మన్ ఫోస్టర్ కంటే మధ్యలో వచ్చిన జెనిసిస్ సంస్థకు ఎక్కువ చెల్లింపులు చేయటం విశేషం. ఇవన్ని ఎవరి ఖాతాలోకి వెళ్ళాయో ఊహించుకోవటం పెద్ద కష్టం కాదు. కేవలం అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హైకోర్టు వంటి నాలుగు భవనాల డిజైన్లకు ప్రపంచంలో ఎవరైనా 250 కోట్ల రూపాయల మొత్తం చెల్లిస్తారా?. ఎందుకు చెల్లించరు..చంద్రబాబు లాంటి నేతలు ఉన్నారు కదా?. రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల్లో చేసే భారీ దోపిడీ చాలదన్నట్లు చివరకు డిజైన్లలోనూ వందల కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడిన తీరుపై ప్రభుత్వ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story
Share it