అల్లు అర్జున్ కొత్త సినిమా షురూ
BY Telugu Gateway13 April 2019 6:49 AM GMT
X
Telugu Gateway13 April 2019 6:49 AM GMT
గ్యాప్ తీసుకున్నా అల్లు అర్జున్ స్పీడ్ పెంచాడు. వరస సినిమాలు కమిట్ అయ్యాడు. అయితే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించనున్న సినిమా షూటింగ్ మొదలైంది. లాంఛనంగా ఈ సినిమా షూటింగ్ శనివారం నుంచి మొదలైంది. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అల్లు అర్జున్ సరసన ఇందులో పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ నూతన సినిమా ప్రారంభోత్సవానికి సినీ రంగానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సినిమాతో పాటు సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించాడు బన్నీ.
Next Story