Telugu Gateway
Politics

చెన్నయ్ లో 1381 కిలోల బంగారం స్వాధీనం..కలకలం

చెన్నయ్ లో 1381 కిలోల బంగారం స్వాధీనం..కలకలం
X

ఒకటి కాదు..రెండు కాదు. ఏకంగా 1381 కిలో బంగారం. ఓ వైపు నోట్ల వరద. ఇప్పుడు సడన్ గా ఇంత భారీ మొత్తంలో బంగారం కన్పించటంతో ఒక్కసారిగా కలకలం. అసలు ఈ బంగారం ఎవరిది?. ఇప్పుడు ఎందుకు..ఎక్కడకి దీన్ని తరలిస్తున్నారు వంటి ప్రశ్నలు ఉదయించటం సహజమే. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్. చెన్నయ్ సమీపంలోని తిరువల్లూరు టోల్ గేట్ వద్ద తనిఖీల్లో ఈ బంగారాన్ని గుర్తించారు. అయితే ఇది రాజకీయ పార్టీలకు చెందినదా? అన్న కోణంలోనూ పరిశీలన సాగుతోంది. అయితే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బంగారంగా వాహన సిబ్బంది చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన పత్రాలు అందిన తర్వాతే ధృవీకరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.

రెండు వ్యాన్లలో బంగారం, కొంతమేర నగదును తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగారానికి సంబంధించి సరైన సమాధానం రాకపోవడంతో వాహనాలతో సహా సీజ్‌ చేశారు. గురువారం దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ జరుగునున్న నేపథ్యంలో భారీగా బంగారం పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్లకు పంచేందుకే తరలిస్తున్నారా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. తొలి విడుత పోలింగ్‌ ముందు కూడా తమిళనాడు సరిహద్దుల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తనిఖీల్లో పట్టుకున్న బంగారాన్ని విడిపించేందుకు టీటీడీ ఇచ్చిన లేఖతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మేనేజర్‌ తమిళనాడుకు బయలుదేరినట్లు సమాచారం.

Next Story
Share it