Telugu Gateway
Latest News

మోడీకి షాకిచ్చిన ‘డేటా’

మోడీకి షాకిచ్చిన ‘డేటా’
X

ఎన్నికల వేళ ప్రధాని నరేంద్రమోడీకి ఓ డేటా షాకిచ్చింది. అందులో వెల్లడైన అంశాలు ఖచ్చితంగా కేంద్రంలోని బిజెపి సర్కారును ఇరకాటంలో పెట్టేవే. దేశంలోని ప్రముఖ సంస్థ అయిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించిన గణాంకాలు బిజెపికి కీలకంగా ఉన్న యూత్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించేవే. మోడీ పెద్ద సంస్కరణగా భావించి చేసిన పెద్ద నోట్ల రద్దుతో ఏకంగా 1.10 కోట్ల మంది ఉద్యోగాలు ఊడాయని సీఎంఐఈ జనవరి నివేదిక బహిర్గతం చేసింది.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన గణాంకాల సంస్థ నివేదిక బహిర్గతం అయినా కూడా సర్కారు మాత్రం ఇది ముసాయిదా అని మరొకటి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు సీఎంఐఈ డేటా మాత్రం అత్యంత కీలకంగా మారనుంది. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో 7.2 శాతానికి చేరింది. 2016 తర్వాత ఇంత గరిష్ట స్థాయికి చేరటం ఇదే మొదటిసారి కావటం గమనార్హం. గత ఏడాది ఫిబ్రవరిలో నిరుద్యోగ రేటు 5.9 శాతం గా ఉంది.

Next Story
Share it