Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధుల ప్రకటన

టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధుల ప్రకటన
X

అసెంబ్లీ ఎన్నికల ముందు అభ్యర్దులను చాలా ముందస్తుగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీల అభ్యర్ధుల ఖరారులో మాత్రం జాప్యం చేసింది. నామినేషన్లకు కేవలం రెండు రోజుల సమయం ఉందనగా అభ్యర్ధుల పేర్లు ప్రకటించింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ గురువారం సాయంత్రం టీఆర్ఎస్ అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టీఆర్ ఎస్ హ్యాండ్ ఇచ్చినట్లు అయింది. అందులో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ లు ఉన్నారు.

పొంగులేటి, జితేందర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపునకు సహకరించలేదనే ఆరోపణలు రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ అభ్యర్ధులకు కెసీఆర్ స్వయంగా భీఫాంలు అందజేశారు. నల్లగొండ సీటు గుత్తా సుఖేందర్ రెడ్డికే కేటాయిస్తారని ప్రచారం జరిగినా..అక్కడ నుంచి నర్సింహారెడ్డికి చోటు కల్పించారు. పెద్దపల్లి సీటు వివేక్ కు వస్తుందని అనుకున్నా..అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సోదరుడు వినోద్ వ్యవహరించిన తీరు..ఆయనకు వివేక్ మద్దతు అంశాలు దెబ్బతీశాయని చెబుతున్నారు.

టిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులు వీళ్లే

  1. మెదక్ - కొత్త ప్రభాకర్ రెడ్డి
  2. కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్
  3. నిజామాబాద్ -కల్వకుంట్ల కవిత
  4. జహీరాబాద్ - బి బి పాటిల్
  5. ఆదిలాబాదు - నగేష్
  6. వరంగల్ - పసునూరి దయాకర్
  7. భువనగిరి - బూర నర్సయ్య గౌడ్
  8. నల్గొండ - వేంరెడ్డి నర్సింహారెడ్డి
  9. చేవెళ్ల - డా|| గడ్డం రంజిత్ రెడ్డి
  10. ఖమ్మం - నామా నాగేశ్వర్ రావ్
  11. నాగర్ కర్నూల్ - పి రాములు
  12. మహబూబాబాద్ - మాలొతు కవిత
  13. పెద్దపల్లి - వెంకటేష్ నేతగాని
  14. మల్కాజిగిరి - మర్రి రాజశేఖర్ రెడ్డి
  15. మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి
  16. సికింద్రాబాద్ - తలసాని సాయి కిరణ్ యాదవ్

17.హైదరాబాద్: పుస్తె శ్రీకాంత్

Next Story
Share it