Telugu Gateway
Politics

టీడీపీ యాడ్స్ లోనూ లోపించిన ‘సహజత్వం’

టీడీపీ యాడ్స్ లోనూ లోపించిన ‘సహజత్వం’
X

తెలుగుదేశం పార్టీ ‘మాయ’లు చేయటంలో దిట్ట. రాజధాని పేరుతో కొన్ని సంత్సవరాలుగా అద్భుతమైన ‘బొమ్మలు’ చూపించి మాయ చేసింది. ఇప్పుడు సింగపూర్ కంపెనీలు లేవు..సింగపూర్ రాజధాని లేదు. ఎన్నికల ముందు కూడా అదే తరహాలో ‘అసహజ’ యాడ్స్ చూపిస్తోంది. యాడ్ ఏదైనా ప్రజలకు ‘కనెక్ట్’ అయ్యేలా ఉండాలి. కానీ అవన్నీ రివర్స్ గేర్ లో వెళుతున్నాయి. ఏ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా అవి విజయవంతంగా ప్రజల్లోకి వెళితే వాటిని ప్రజల మది నుంచి చెరిపేయటం ఎవరివల్లా కాదు. ఎన్ని పార్టీలు..ఎంత మంది నేతలు చెప్పినా ప్రజలు వాటిని నమ్మరు. ఎందుకంటే అవి వారు అనుభవించారు కనుక. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశాలతో ఎన్నికల యాడ్స్ విడుదల చేసింది. ‘ప్రతి సారి నువ్వు పంట వేయటం. ఆశతో ఆకాశం వైపు చూడటం. నీరు లేక పంట ఎండిపోవటం. ప్రతి సారి నీ గుండె మండిపోవటం. ఒకప్పుడు ఈ నేల నీళ్ళతో కన్నా నువ్వు ఏడ్చిన కన్నీళ్ళతో తడిచిందిరా.

చివరికి నేను చచ్చినా ఈ పొలానికి ఎరువు అవుతానని ప్రాణం తీసుకుంటివి కదరా?. ‘ఇప్పుడు చూడరా. ఇప్పుడు చూడరా. ఇప్పుడు నీ పొలం నీళ్ళతో తడిచింది. పచ్చగా ఎదిగింది. ఎటుచూసినా ఈ ప్రాంతం పచ్చదనమే. ఎవరి పొలం ఎండదు. ఎక్కడ పట్టిసీమ..ఎక్కడ రాయలసీమరా’ అంటూ ఓ రైతు చెప్పే డైలాగ్ లతో యాడ్ తయారు చేశారు. చనిపోయిన కొడుకు ఫోటోకు రైతు పచ్చటి పొలాలను చూపించిన సన్నివేశం చూసే ప్రేక్షకులు షాక్ కు గురవ్వాల్సిందే. మరో యాడ్ లో పట్నంలో ఉద్యోగం చేసుకునే కొడుకు వ్యవసాయం చేయటం కోసం ఉద్యోగం వదిలి వస్తాడు. ‘మనకు పన్నెండు ఎకరాల భూమి ఉంది. ఒకప్పుడు నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్ళు వచ్చాయి. మీకూ తెలుసు రైతులకు ప్రభుత్వం రుణ మాఫీ చేసిందని. రైతు రుణ పథకంలో రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్ల రుణం అందిస్తోంది. తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంట్ పగటి పూట ఇస్తుంది.

హార్టికల్చర్ కింద పండ్ల తోటలు పెంచితే 90 శాతం సబ్సిడీ ఉంది. డ్రిప్ ఇరిగేషన్ కు కూడా 90 శాతం సబ్సిడీ ఇస్తున్నారు కదా?. పంటకు ఏమైనా జరిగితే పంట భీమా. ఇన్ని పథకాలు అందుతున్నాయని తెలుసుకున్నా మీకు దూరంగా ఎక్కడో ఉద్యోగం చేసుకుని బతకాల్సిన అవసరం ఏముంది నాన్నా’? అంటూ మరో యాడ్ వస్తుంది. గ్రామంలో ఉన్న రైతులకు ప్రభుత్వం ఏమేమి చేస్తుందో తెలియదా?. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న వ్యక్తి వచ్చి రైతులకు ఈ విషయాలు చెబుతారా?. ఇదంతా ఒకెత్తు అయితే చంద్రబాబు పాలన చూసి ..రైతులకు చేస్తున్న సాయం చూసి ఉద్యోగాలు వదిలేసి మరీ ఏపీలో వ్యవసాయం చేయటానికి యువత వెనక్కి వచ్చేస్తున్నారంటే చంద్రబాబు ఎంతైనా గ్రేట్.

నదుల అనుసంధానం యాడ్

https://www.youtube.com/watch?v=ASOUYCRuXLE

Next Story
Share it