Telugu Gateway
Politics

దొంగ ట్వీట్ల స్కాంలో టీడీపీ!

దొంగ ట్వీట్ల స్కాంలో టీడీపీ!
X

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ వరస చిక్కుల్లో పడుతోంది. ఓ వైపు డాటా స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుండగా..ఇఫ్పుడు దొంగ ట్వీట్ల స్కామ్ కూడా దుమారం రేపుతోంది. తెలంగాణ సర్కారు ప్రతిష్టను మంటగలిపేలా టీడీపీ ఈ స్కామ్ ప్లాన్ చేసినట్లు తెలంగాణ ఐటి శాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ ప్రజల డాటాను అక్రమంగా ఒక ప్రైవేటు కంపెనీకి అడ్డగోలుగా అప్పజెప్పిన కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు అతితెలివి ప్రదర్శించి మరోసారి దొరికిపోయారని చెబుతున్నారు. ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలతో సహా డేటా అంతా దొరకడం, సదరు డేటాను తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో ఓటరు లిస్టులను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తుందనే ఆరోపణ రావడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ట్విట్టర్లో #TSGovtStealsData అనే హ్యాష్ ట్యాగును ట్రెండ్ చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ హ్యాష్ ట్యాగుపై వస్తున్న ట్వీట్లను పరిశీలించగా అసలు గుట్టు రట్టు అయింది. అసలు ఆంధ్రతో, తెలంగాణతో కానీ ఏ సంబంధం లేని కొన్ని వేల ట్విట్టర్ అకౌంట్ల నుండి ఈ ట్వీట్లు వచ్చాయి.

ఇందులో అనేక హ్యాండిల్స్ ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల వారు చేసినవి. ఇందులో తెలుగులో వచ్చిన ట్వీట్లు కూడా అసలు తెలుగు భాష రాని వారి ట్విట్టర్ అకౌంట్ల నుండి రావడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ ఈ ట్విట్టర్ హ్యాష్ ట్యాగును కృత్రిమంగా ట్రెండ్ చేయడానికి ఒక ఏజెన్సీకి భారీ ఎత్తున డబ్బు ముట్టజెప్పిందని, వారు వేలాది ఫేక్ ట్విట్టర్ హ్యాండిల్స్ ను కిరాయికి మాట్లాడుకుని ఈ ట్వీట్లను చేపించారని తెలిసింది. అందుకే బొంబాయికి చెందిన రియా అనే ఒక మోడల్, సంతోష్ షుక్లా అనే యాక్టరు, బాలీవుడ్ చోక్ అనే గురుగ్రాం ట్విట్టర్ అకౌంట్ వీళ్లందరూ ఈ అంశం గురించి, చంద్రబాబుకు మద్ధతుగా ట్వీట్ చేశారు. గమ్మత్తేమిటంటే ఈ ట్విట్టర్ అకౌంట్లు అన్నిటిలో ఒకే విధమైన ట్వీట్లు ఉండటం. ఈ ట్వీట్లు చేసిన వారందరూ రోజూ ఎవరు డబ్బులు ఇస్తే వారికి ట్వీట్ లు చేసిపెట్టే కిరాయి మనుషులు. ఒక తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడానికి ఉల్టా తెలంగాణ ప్రభుత్వం మీద ఎదురుదాడికి ప్రయత్నించిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు ఈ క్యాష్ ఫర్ ట్వీట్ స్కాములో మరోసారి బుక్కయ్యారు.

Next Story
Share it