Telugu Gateway
Cinema

చిరంజీవి సినిమాలో శృతిహాసన్

చిరంజీవి సినిమాలో శృతిహాసన్
X

శృతిహాసన్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే ఈ భామ ఇప్పుడు చిరంజీవి సినిమాతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుందని టాక్. ప్రస్తుతం ఇదే పిల్మ్ నగర్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్న విషయం. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న ఈ సినిమాలో చిరంజీవితోపాటు శృతిహాసన్ కీలకపాత్ర పోషించనుందని సమాచారం. అయితే ఆమె చిరుకు జోడీగా కాకుండా..ఓ ప్రదాన పాత్ర పోషిస్తోందని టాక్.

ఈ సినిమాను తెరకెక్కిస్తున్నది కూడా మెగా ఫ్యామిలీకి చెందిన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ కావటం విశేషం. ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో శృతి హాసన్ మెగా ఫ్యామిలీ హీరోలు పవన్‌ కల్యాణ్, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌లకు జోడిగా నటించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it