Telugu Gateway
Politics

ఎన్నికల తర్వాత జాతీయ పార్టీనా?

ఎన్నికల తర్వాత జాతీయ పార్టీనా?
X

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ చేసిన జాతీయ పార్టీ ప్రకటనను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయ్యాక జాతీయ పార్టీ పెట్టి ఏమి చేస్తారని ప్రశ్నించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకొనేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ 16 సీట్లు కోరుతున్నారని రేవంత్ ఆరోపించారు. ఫిరాయించిన వారితో కలిపి గత 60 నెలలుగా కేసీఆర్‌ వద్దే 16 మంది ఎంపీలున్నారని, అయినా ఏమీ సాధించలేకపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి లోక్ సభ బరిలో నిలిపిన విషయం తెలిసిందే.

తన గెలుపునకు సహకరించాల్సిందిగా రేవంత్ ఇప్పటికే సీపీఐ నేతల సహకారం కోరారు. సోమవారం నాడు ఆయన టీజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ను కలసి ఆయన మద్దతు కోరారు. పార్టీలో చర్చించి రేవంత్ కు మద్దతుపై నిర్ణయం తీసుకుంటామని కోదండరాం తెలిపారు. టీజెఎస్ రెండు లేదా మూడు నియోజకవర్గాలలో పోటీచేస్తుందని, మిగిలిన చోట్ల కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని కోదండరామ్ చెప్పారు.

Next Story
Share it