Telugu Gateway
Politics

వద్దంటే వెళ్లాను మంగళగిరికి..!

వద్దంటే వెళ్లాను మంగళగిరికి..!
X

ఐదేళ్ళ పాటు ఏ స్కీమ్ లో ఏ స్కాం చేయవచ్చో అనే అంశంపై మాత్రమే ఫోకస్ పెట్టారు. అంతే కానీ తన రాజకీయ వారసుడు అయిన నారా లోకేష్ ‘రాజకీయ భవిష్యత్’పై తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరైన ఫోకస్ పెట్టలేదా?. ఔననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. కొత్తగా ఎన్నికల బరిలో నిలిచే ఎవరైనా ఏడాది..రెండేళ్ళ ముందు నుంచే తాను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంపై ఫోకస్ పెడతారు. ఆర్థికంగా బలమైన అభ్యర్ధులు అయితే ‘ట్రస్ట్’ల పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆయా నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దీని వల్ల ఎన్నికల సమయంలో అభ్యర్ధులు తమ గురించి ప్రజలకు పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ప్రముఖ పార్టీ టిక్కెట్ ఇస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆర్థికంగా..రాజకీయంగా ఏ మాత్రం లోటు లేని నారా లోకేష్ ను సడన్ గా ‘మంగళగిరి’లో ల్యాండ్ చేయటం వల్ల చిక్కులు వచ్చి పడుతున్నాయని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యర్ధులు టార్గెట్ చేస్తారనుకుంటే అంతర్గతంగా అయినా ఫోకస్ పెట్టాలి. కానీ నారా లోకేష్ ప్రస్తుతం బరిలో నిలిచిన మంగళగిరి నియోజకవర్గంపై అటు చంద్రబాబు, ఇటు నారా లోకేష్ లు ఏ మాత్రం ‘ ప్రత్యేక శ్రద్ద’ పెట్టిన దాఖలాలు లేవు.

పైగా ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో సర్కారు కూడా నిధుల మంజూరులో నిర్లక్ష్యం చూపిందనే విమర్శలు ఉన్నాయి. అలాంటి చోట సడన్ ఎంట్రీతో లోకేష్ కు రాజకీయంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుందా?. అంటే డౌటే అంటున్నారు టీడీపీ నేతలు. దీనికి తోడు ప్రచారంలో నారా లోకేష్ చేస్తున్న ప్రసంగాలు కూడా ప్రజల్లో నవ్వుల పాలు అవుతున్నాయి. దీనికి తోడు ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో పెద్దగా జనాలు వస్తున్న దాఖలాలు లేవు. ఆ వీడియోలు అన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నారా లోకేష్ కు మంగళగిరి సీటు కేటాయించిన వెంటనే పాత సినిమాల్లోని ఓ పాట ‘వద్దంటే వెళ్లాను మంగళగిరికి’ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మిగిలిన అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి..నారా లోకేష్ టిక్కెట్ కేటాయింపు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సరిగా ఫోకస్ పెట్టలేదనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తొలుత విశాఖపట్నం జిల్లాలోని భీమిలి. విశాఖ నార్త్ సీటు ఇస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే బాలకృష్ణ అల్లుళ్ళు ఇద్దరికీ ఒకే చోట సీటు కేటాయిస్తే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో లోకేష్ ను చివరకు మంగళగిరికి మార్చారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో తెలిసి కూడా లోకేష్ సీటుపై ముందస్తు ఫోకస్ పెట్టకపోవటం అనేది పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోందని ఓ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it