Telugu Gateway
Politics

అడ్డంగా బుక్కయిన నారా లోకేష్

అడ్డంగా బుక్కయిన నారా లోకేష్
X

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. ఇఫ్పటికే మంగళగిరి ప్రచారంలో ఎన్నో వింత వ్యాఖ్యలు..విచిత్ర విన్యాసాలతో హాట్ టాపిక్ గా మారిన లోకేష్ మరోసారి దొరికి పోయారు. ఆయనకు అత్యంత కీలకమైన ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయో తెలియకుండా ప్రచారం చేస్తున్నారు. ఏకంగా ఏప్రిల్ 9న ఎన్నికలు అని ప్రకటించి ఓటర్లను కూడా షాక్ కు గురిచేశారు. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఒకేసారి ఏప్రిల్ 11న ఎన్నికలు జరగననున్న విషయం తెలిసిందే.

మరి నారా లోకేష్ చెప్పినట్లే మంగళగిరి ఓటర్లు ఏప్రిల్ 9న ఓట్లకు బయలుదేరితే పరిస్థితి ఏంటి?. లోకేష్ వ్యాఖ్యలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎన్నికలు తొమ్మిదో తేదీన కాదు, పదకొండున అని పక్కనే ఉన్న తెలుగు దేశం నాయకుడు బండి చిరంజీవి అందివ్వడంతో లోకేశ్‌ కవర్‌ చేసుకోవడానికి ట్రై చేశారు. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే లోపు లోకేష్ ఇలాంటి విన్యాసాలు ఎన్ని చేస్తారో అన్న టెన్షన్ తెలుగుదేశం నేతల్లో నెలకొంది.

Next Story
Share it